నేనే సీ.ఎం.. కాదు, కాదు నేనే పీ.ఎం...

250 కోట్లు దొబ్బించుకుని బీహార్ నుండి దిగుమతి చేసుకున్న రాజకీయ బేహారీ ప్రశాంత్ కిశోర్ జగన్ కు ఒక అద్భుతమైన సలహా ఇచ్చాడట. జగన్ దొబ్బేసిన లక్ష కోట్లలో ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి 100 కోట్లు ఖర్చు చేసి ఆంధ్ర ప్రదేశ్ లో 20 ఎంపీ సీట్లు గెలుచుకొని మిగిలిన రాష్ట్రాల్లో టిఎంసి, డీఎంకే, ఆర్జేడీ, సమాజవాది,  బీఎస్పీ, శివసేన, బిజూ జనతాదళ్, జెడి యు, టీఆర్ఎస్ మొదలైన  ప్రాంతీయ పార్టీలకు చెందిన ఒక్కో ఎంపీకి 100 కోట్లు ఇచ్చి ఇంకో 100 మంది ఎంపిలను కొనుగోలు చేస్తే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఏకంగా పీ.ఎం ఐపోవచ్చనే సలహా ఇచ్చాడట. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఓడిపోయి డీలా పడిన జగన్ ఇప్పుడిక నేనే సియం అనే పాత పాట వదిలేసి త్వరలో నేనే పీఎం అనే కొత్త పల్లవి ఎత్తుకుంటాడని వైకాపా వర్గాలు అంటున్నాయి. " ఏమో! గుర్రం ఎగరా వచ్చు!!" జగనా.. మజాకా... అసలే కాబోయే సి.యం.. కాదు, కాదు పీ.ఎం...

Comments