ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ చచ్చి పోయింది. ఏకపక్షంగా జరిగిన రాష్ట్ర విభజనలో ఆంధ్రకు జరిగిన అన్యాయానికి ప్రతి ఆంధ్రుడి గుండె రగిలిపోయింది, ఆ పార్టీని ఆంధ్ర ప్రజలు భూస్థాపితం చేసేసారు. 2014 ఎన్నికల్లో ఆ పార్టీకి రాష్ట్రంలో ఎక్కడా డిపాజిట్లు కూడా దక్కలేదు, ఎమ్మెల్యే సీటు కాదుగదా కనీసం ఒక్క ఎంపిటిసి సీటు కూడాగెలుచుకోలేకపోయింది. నిన్నకాక మొన్న జరిగిన నంద్యాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధికి 2014 ఎన్నికల్లో కన్నా కూడా తక్కువ ఓట్లు పోలయ్యాయి. కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసే దమ్ము, బలం లేక కేవలం 17 వార్డులకు పోటీ చేసి 700 ఓట్లు మాత్రమే తెచ్చుకోగలిగింది. ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీకి అంతకన్నా సిగ్గు చేటైన విషయం ఇంకేముంటుంది?
కాంగ్రెస్ పార్టీలో తెలివిగల వాళ్ళు ఇప్పటికే టిడిపిలో వైకాపాలో చేరిపోయారు. నెత్తిమీద రూపాయి పెడితే పైసాకు కూడా చెల్లుబాటు కాని, ఏ పార్టీలో చోటు దొరకని రఘువీరా రెడ్డి, కె వి పి రామచంద్రరావు, జె డి శీలం, చిరంజీవి, తులసిరెడ్డి, సి రామచంద్రయ్య లాంటి వాళ్ళు మాత్రమే ఆ పార్టీలో నాయకులుగా చెలామణీ అవుతున్నారు. "లేస్తే మనిషిని కాను" అనే సామెతను గుర్తు చేస్తూ 'రాబోయే ఎన్నికల్లో ప్రజలు తెదేపాకు గుణపాఠం చెబుతారని, రాహుల్ గాంధీ సారధ్యంలో ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయటానికి ప్రణాళికలు రచిస్తున్నామని' రఘువీరారెడ్డి, కెవిపి లాంటి 'మాడా' గాళ్ళు చెప్పటం చూస్తుంటే... ఐనా మన పిచ్చి కానీ "శవంతో కాపురం చేస్తే పిల్లలు పుడతారా?" అని ఆంధ్ర ప్రజలు నవ్వుకుంటున్నారు.

Comments
Post a Comment