గంగలో మునిగితే పాపాలు ప్రక్షాళనౌతాయా?

నిన్న మొన్నటి వరకు వైసిపి లో ఉండి చంద్రబాబును పచ్చి బూతులు తిట్టిన కొంతమంది ఎమ్మెల్యేలు గోడ దూకి తెలుగుదేశం పార్టీలో చేరటానికి  సిద్ధంగా ఉన్నారని తెదేపా వర్గాలు అంటున్నాయి. వైకాపా ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో వారితో తెదేపా నాయకులకు, కార్యకర్తలకు విభేదాలున్నాయి. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటూ బురదజల్లుకుంటున్నారు. రేపు ఆ ఎమ్మెల్యేలు పార్టీ మారి తెలుగుదేశం పార్టీలో చేరితే వాళ్ళు నీతిమంతులైపోతారా, చంద్రబాబు నాయుడుపై చేసిన ఆరోపణలు చెల్లకుండా పోతాయా? వైకాపాలో కొందరు ఎమ్మెల్యేలు తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాకానీ, చంద్రబాబు నాయుడుపై వ్యక్తిగత దూషణల విషయంలో కొంత సంయమనం పాటిస్తున్నారు. ఇలాంటి ఎమ్మెల్యేలకు కొంత మినహాయింపు ఇచ్చి పార్టీలో చేర్చుకున్నా పర్లేదు కానీ పక్కా చెత్త బ్యాచ్ రోజా, కొడాలి నాని, చెవిరెడ్డి, గిడ్డి ఈశ్వరి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కాకాణి గోవర్ధనరెడ్డి, శ్రీధరరెడ్డి, రవీంద్రనాథరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళని మాత్రం దూరంగా ఉంచాలని తెదేపా శ్రేయోభిలాషులు, చంద్రబాబు నాయుడు అభిమానులు కోరుకుంటున్నారు.  చెత్త పోగేసుకుంటే కంపుకొడుతుందేతప్ప ప్రయోజనం ఉండడదని బాబుగారు గ్రహించాలని మనవి.  

Comments