దోచుకుంటాం రండి..

పండగ వచ్చిందంటే కుక్కలకు హడావిడి అనేది పాత సామెత. ఈరోజుల్లో ఏదైనా పండగ వచ్చిందంటే ప్రైవేట్ బస్సు ఆపరేటర్లకు, ఆర్టీసీ వాళ్లకు పండగే పండగ. చార్జీలు రెట్టింపు చేసేస్తారు, స్పెషల్ బస్సుల పేరుతొ ముసలి బస్సులు కూడా ముస్తాబు చేసుకుని పెళ్లికూతురుల్లా రోడ్డెక్కుతాయి. సగటు మానవుడు ఫ్యామిలీతో సహా పండగకి ఊరెళ్లాలంటే జీతం డబ్బుల్లో సగం చార్జీలకే తగలెయ్యాల్సి వస్తుంది. ప్రైవేటు ఆపరేటర్లతో కుమ్ముక్కైన ఆర్టీసీ కూడా దోచుకుంటాం రండి అంటూ ప్రయాణీకుల జేబులతో ఆటలాడుకుంటుంది. బాబుగారూ.. మీరైనా ఈ విషయం పై ద్రుష్టి సారించి ఈ దసరా పండుగ సందర్భంగా చార్జీల విషయంలో కాస్త కనికరించి ఆర్టీసీ తో పాటు ప్రైవేట్ బస్సుల చార్జీలు కూడా అందుబాటులో ఉంచి సగటు మానవుడు ఆనందంగా చుట్టాలతో పండుగ చేసుకునే వాతావరణం కల్పించండి. "ప్రభుత్వ రవాణా సంస్థ" ను "ప్రభుత్వ రావణ సంస్థ" గా మార్చకండి. 

Comments