భారతరత్న సరే! కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టేదెప్పుడు?


ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి తెదేపా నాయకులు పదే పదే విజ్ఞప్తులు చేస్తున్నారు. భారతరత్న విషయంలో నిర్ణయం తీసుకోవలసింది భాజపా ప్రభుత్వం, మోడీ మాత్రమే, కానీ ఎప్పటినుండో ఆంధ్ర ప్రజల కోరిక కృష్ణా జిల్లాకు యన్టీఆర్ పేరు పెట్టటంలో టిడిపి ప్రభుత్వం, చంద్రబాబు ఎందుకు తాత్సారం చేస్తున్నారో యన్టీఆర్ అభిమానులకు ఏమాత్రం అర్ధంకావటం లేదు. ఒక జిల్లాకు పేరు మార్చే అధికారం రాష్ట్రప్రభుత్వానికి ఉంటుంది. రాజశేఖరరెడ్డి మరణం తరువాత నెల రోజుల వ్యవధిలోనే కడప జిల్లాకు ఆయన పేరు పెట్టారు, తెరాస ప్రభుత్వం తెలంగాణలో ఒక జిల్లాకు జయశంకర్ పేరు పెట్టింది. యన్టీఆర్ స్థాయి వారికంటే తక్కువా? కృష్ణా జిల్లాకు యన్టీఆర్ పేరు ఇంతవరకు పెట్టకపోవటానికి కారణమేమిటో యన్టీఆర్ అభిమానులకు తెదేపా నాయకులు, తెదేపా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ముందు మనం కృష్ణా జిల్లాకు యన్టీఆర్ పేరు పెట్టి ఆ తరువాత ఆయనకు భారతరత్న గురించి ఉద్యమిద్దాం.

Comments